దుబాయ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ కొత్త రవాణా విధానం నగరంలోని కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం-పామ్ జుమైరా మధ్య ప్రయాణ సమయం 10 నిమిషాలకు తగ్గుతుంది, ప్రస్తుతం కారులో 45 నిమిషాలు పడుతుంది. నవంబర్ 16, 2025న దుబాయ్ RTA డైరెక్టర్ జనరల్ అల్ తాయర్ మాట్లాడుతూ, ఈ సేవ భవిష్యత్ నగరంగా దుబాయ్ స్థానాన్ని పటిష్టం చేస్తుందని తెలిపారు. ప్రారంభంలో నాలుగు ప్రదేశాల నుండి సేవలు అందుబాటులోకి వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa