ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాగోస్ దీవుల విషయంలో మాటమార్చిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 01:16 PM

అమెరికా, ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ వారాంతంలో ఇరాన్ పై అమెరికా దాడి చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ సమీపంలోకి అమెరికా భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను తరలించడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన చాగోస్ దీవుల్లోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి కోరారు.ఇరాన్‌ పై దాడి చేయాల్సి వస్తే డియెగో గార్సియా స్థావరం అత్యంత కీలకమని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ చట్టాలు మరియు ఇతర కారణాల దృష్ట్యా ఈ స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. స్టార్మర్ తీరుతో విసిగిపోయిన ట్రంప్.. చాగోస్ దీవుల విషయంలో మాటమార్చారు. వాస్తవానికి ఈ దీవిని 99 ఏళ్ల పాటు మారిషస్ కు అప్పగించాలని బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది.రెండు వారాల క్రితం ఈ డీల్ ను ట్రంప్ మెచ్చుకున్నారు. తాజాగా ఈ డీల్ అత్యంత చెత్త ప్రయత్నమంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ప్రధాని స్టార్మర్ ఏ కారణం చేతనైనా డియెగో గార్సియాపై పట్టు కోల్పోకూడదు. ఈ భూమిని యూకే నుండి వేరు చేయకూడదు” అని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ విషయంలో ట్రంప్ తాజా పోస్ట్ ను అమెరికా స్టాండ్ గా భావించాలని స్పష్టతనిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa