హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మూడు సార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇక్కడ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. విపక్షాల విమర్శల నేపథ్యంలో, ఆయన స్థానికేతరుడు కాదని నిరూపించుకోవడానికి, శుక్రవారం వనంకాలనీలోని 81 స్థలంలో సంప్రదాయబద్ధంగా భూమిపూజ చేశారు. ఈ ఇంట్లో మూడు అంతస్తులు, స్విమ్మింగ్ పూల్, పార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa