ప్రొద్దుటూరు మండల పరిధిలోని మీనాపురం గ్రామ ప్రజలకు ఉచితంగా రక్త వర్గ నిర్దారణా పరీక్షలు నిర్వహించినట్లు రాణి తిరుమలదేవి డిగ్రి కళాశాల ప్రిన్సిపల్ టి. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్. ఎస్. ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు గ్రామ ప్రజలు, ప్రాధమిక విద్యార్థులు, ఉపాధ్యాయులకు రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎన్. ఎస్. ఎస్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.