పులివెందులలో కాల్పుల ఘటన రాష్ట్రంలో గన్ కల్చర్‌కు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘తుపాకీ దుర్వినియోగం చేశాడన్న చరిత్ర ఉన్న వ్యక్తికి మళ్లీ లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేశారు? ఎవరు సహకరించారు? నేరస్థుల అరాచకాలకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.