కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడం చారిత్రక తప్పిదమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడైన రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షపూరితంగా, రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు.