కడప జిల్లా పులివెందులలో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు. మరొకరికి తూటా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పులివెందుల పట్ణణంలో నగరిగుట్టకు చెందిన గొర్ల భరత్‌కుమార్‌యాదవ్, చింతకుంట దిలీ్‌పకుమార్, రాగిపాటి మహబూబ్‌బాషా ఆలియాస్ యాక్షన్బాషాల మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల వివాదం జరుగుతోందని స్థానికులు అంటున్నారు.ఇవన్నీ కూడా మట్కా, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన లావాదేవీలే! ఈ నేపథ్యంలో భరత్‌కుమార్‌యాదవ్.... డబ్బుల విషయమై మంగళవారం మధ్యాహ్నం దిలీ్‌పకుమార్, యాక్షన్ బాషాతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఆగ్రహానికి గురైన భరత్‌కుమార్‌యాదవ్,,,, హుటాహుటిన తన ఇంట్లోకి వెళ్లి తుపాకి తీసుకువచ్చారు. దిలీప్, బాషాలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ దిలీ్‌పకుమార్ గుండె కింద భాగాన దిగింది. బాషాకు చేయి, కాలి పిక్కకు రెండు బుల్లెట్లు తగిలాయి. చికిత్స కోసం దిలీ్‌పకుమార్‌ను వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడు. బాషాను పులివెందుల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం కడప రిమ్స్ తరలించారు.