భర్తతో గొడవపడి పుట్టింటి నుంచి అత్తింటికీ వెళ్తూ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది ఒక మహిళ. వివరాల్లోకి వెళ్ళితే.... కర్నూలు జిల్లా నన్నూరుకు చెందిన ఈదువెల సాలమ్మ నిండు గర్భిణీ, కాగా కొన్ని నెలల క్రితం కాన్పు కోసం పుట్టిలైన త్రిపురాంతకం వచ్చింది. అయితే ఆమె భర్త శ్రీను కూడా త్రిపురాంతకం వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య ఏవో కుటుంబ కలహాల నేపధ్యంలో వాగ్వా దం జరిగింది. ఈ క్రమంలో శ్రీను తన స్వగ్రామం వెళ్లిపోయాడు. దీంతో సాలమ్మ కూడా తన ఇద్దరి బిడ్డలతో అత్తింటికి ఆర్టీసీ బస్సులో బయలు దేరింది.దోర్నాల సమీపంలోకి వచ్చే సరికి పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. గమనించిన పొరుగు వారు డైవర్‌కు చెప్పి బస్సు నిలిపివేశారు. బస్సులోనే ఆమె ప్రసవించింది.పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అందరూ సంతోషించారు. కాని కొద్ది సేపటికేశిశువు చనిపో యాడు. బస్సు కుదుపులకు అలా జరిగి ఉండవచ్చని ప్రయాణికులు భావిస్తున్నారు. ఆమె ను, బిడ్డను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారులు ఆమెకు ప్రధమ చికిత్సలు నిర్వహించారు. పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లింది.