యానాం నియోజకవర్గ పరిధిలో గంజాయిని అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు యానాం ఎస్పీ రఘునాయకం తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. స్థానిక జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవించడంతోపాటు అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శేరు నూకరాజు బృందం దాడి చేసింది. యానాం అంబేద్కర్‌నగర్‌కు చెందిన అముదాల రాజశేఖర్, విశాఖ జిల్లా అరకు చెందిన కిముడు శతృఘ్న(శతృ), కనకాలపేటకు చెం దిన ఉలిసి వెంకటలక్ష్మీనారాయణ (నాని)ల వద్ద 950 గ్రాముల గంజాయి, నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది.