ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగనున్న వాటిపై ఓ లుక్కేద్దాం. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీల ధరలు పెరగనున్నాయి. అంటే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు, ఏసీలు, వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్, ఆడుకొనే బొమ్మల ధరలు పెరుగుతాయి.