కడప జిల్లా బహుళార్ధ పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ చిన్న అచ్చెన్న మృతిపై విచారణ మొదలైంది. మార్చి 12న ఆయన అదృశ్యం కాగా 24న మృతదేహం లభ్యమైంది. సహోద్యోగి ఆయనను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీపీసీలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు అచ్చెన్న హత్య కు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు డాక్టర్ సింహాచలం(అడిషనల్ డైరెక్టర్, వైజాగ్), డాక్టర్ వెంకట్రావ్(అడిషనల్ డైరెక్టర్, చిత్తూరు), డాక్టర్ రత్నకుమారి(జేడీ, వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) మంగళవారం కడప కోటిరెడ్డి సర్కిల్‌లోని జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వీపీసీకి వచ్చి అచ్చెన్న కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో జేడీ ఆఫీసుకు చేరుకుని డీడీ అచ్చెన్న అదృశ్యం, హత్య సంఘటనకు గల వివరాలను సేకరించారు. వీపీసీలో డీడీ అచ్చెన్న ఏడీలు శ్రీధర్‌లింగారెడ్డి, సుధీర్‌నాథ్‌బెనర్జీ, పశువైద్యులు సుభా్‌షచంద్రబో్‌సల మద్య వివాదం తలెత్తడానికి గల కారణాలపై ఆరాతీశారు. నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు.