కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులోని కేటీసీ విద్యాసంస్థలో రెండో తరగతి చదువుతున్న జార్ఖండ్ రాష్ట్రం హంతీ జిల్లా కుంతీ గ్రామానికి చెందిన సోనాకుమారి అనే 11 ఏళ్ల బాలిక అస్వస్థతతో సోమవారం మృతిచెందింది. ఈ సమాచారం కాకినాడ ప్రభుత్వాసుపత్రి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి, ఐసీడీఎస్, పోలీసు అధికారులకు మంగళవారం అందడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం ఉండూరుకు చేరుకుని కేటీసీ విద్యాసంస్థలో విచారణ నిర్వహించారు. ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారిణి అన్నపూర్ణ, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరక్టర్ కె.ప్రవీణ, తిమ్మాపురం ఎస్ఐ నాగార్జునరాజు, ఏఎ్‌సఐ సత్యనారాయణరాజు, సామర్లకోట ఎంఈవో వైవీ.శివరామకృష్ణయ్య కేటీసీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని విచారించారు.