ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, తొండంగిలో ఇటీవల దాడిలో మృతిచెందిన నడిపల్లి రాము కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మందకృష్ణ మాట్లాడుతూ.... రాము మృతి రెండు రాష్ట్రాల్లోని దళితుల్లో ఆవేదన నింపిందన్నారు. అన్ని పార్టీల్లో దళితులు ఉన్నప్పటికీ ఏపార్టీలో ఉన్న నేతలు దీన్ని ఖండించకపోవడం విచారకరమన్నారు. ఏ పార్టీలో ఉన్నా బానిసత్వం చేయడమే తప్ప దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం లేదన్న విషయం గమనించాలన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కోరుకున్న రాజ్యాధికారం సాధించాలంటే ఓటుచైతన్యం ముఖ్యమని దానిని సాధించేందుకు కలిసి పనిచేద్దామన్నారు.