కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి హామీలను గుప్పించారు. జేడీఎస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లను సగం ధరకే అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1,000 దాటిందని, ఇంత ధరను భరించడం సామాన్యులకు భారంగా మారింది అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.2,000 ఇస్తామని ప్రకటించారు.