ఎమ్మెల్యే శ్రీదేవి పై వైసీపీ ప్రభుత్వం అనుమానించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని పొన్నూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు బండ్లమూడి బాబురావు అన్నారు. మంగళవారం పట్టణ తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉండవల్లి శ్రీదేవి ఒక ఎస్సీ మహిళ అయినందువలన అనుమానించి అవమానించటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. ఎస్సీలు అంటే రాష్ట్రంలో చులకన భావన ఉందని అందుకు నిదర్శనం ఉండవలెను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఈ మధ్యన జరిగిన సంఘటనలే ఉదాహరణ అని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వైసిపి తగిన మూల్యం చెల్లిస్తుందని ఆయన చెప్పారు.