మన్యం జిల్లా , పార్వతీపురం మండలంలో ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళితే.... స్థానిక ఎంఆర్ నగరానికి చెందిన చేపల వ్యాపారం చేసే బి.విశ్వనాథ్‌కు వెంకటలక్ష్మితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిమధ్య మనస్పర్థలు ఏర్పడడం తో ఏడాది కిందటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్‌తోపాటు అత్తమామలు గృహహింస చేస్తున్నారని, స్థానిక కోర్టులో భార్య కేసు వేసింది. దీనికి మనస్తాపానికి గురైన విశ్వనాథ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.