జగనన్న ఇళ్ల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన అధికారులతో సమావేశంలో మాట్లాడారు. లే అవుట్లలో మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో సచివాలయ సిబ్బంది లబ్ధిదారులతో మాట్లాడి నిర్ణయాలు వేగవంతం చేసేలా కృషి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు.