సామాన్యులకు మరో షాక్. ఏకంగా 800 రకాల మెడిసన్స్ పై 12.12 శాతం ధరలు పెరగనున్నట్లు ఎన్ పీపీఏ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఫీవర్, బీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సలకు వాడే మందులు సహా పెయిన్ కిల్లర్, యాంటీ బయాటిక్స్, కార్డియాక్ మందుల ధరలు సైతం పెరగనున్నాయి. కాగా, మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి.