కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. గురుకుల్ కంగ్రీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని హరిద్వార్‌లోని పతంజలి యూనివర్సిటీని ప్రారంభిస్తారు. హరిద్వార్‌కు చేరుకున్న తర్వాత, షా మొదట గురుకుల్ కంగ్రీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారని, ఆ తర్వాత రాష్ట్రంలోని మల్టీపర్పస్ కోఆపరేటివ్‌ల కంప్యూటరీకరణను ప్రారంభించి, ఉమ్మడి సహకార వ్యవసాయం, జన్ సువిధ కేంద్రాలు, జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. సాయంత్రం పతంజలి యోగపీఠ్‌లో పతంజలి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారని అధికారులు తెలిపారు.