సీతమ్మధార అర్బన్ తహసీల్దార్ కార్యాలయం దరి బస్టాపులో గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం సమీప గాంధీనగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి కూలిపనులు చేసుకుంటూ ఉండేవాడు. కుటుంబసభ్యలతో మనస్పర్ధలు కారణంగా కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవలే అనారోగ్యం బారిన పడటంతో పనులకు వెళ్లలేక బస్టాపులో ఉండేవాడు. బుధవారం ఉదయం ఎంత సేపటికి కదలకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ద్వారకాపోలీసులుసంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.