క్షయ వ్యాధి లక్షణాలను గుర్తించి అప్రమత్తఘైతే నిర్మూలన నివారణ సాధ్యమవుతుందని బుచ్చి రాజుపాలెం వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యురాలు దీపిక అన్నారు. ఈ మేరకు జాతీయ క్షయ నిర్ములన కార్య క్రమంలో భాగంగా టీబీ విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ నిరాశ్రయుల, రాత్రి వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వారికి టిబీ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. రెండు వారాలపాటు తగ్గకుండా ఉండే దగ్గు మందులు వేసినా పక్షం రోజులపాటు తగ్గని జ్వరం మనిషిలో ఆకలి మందగించి క్రమేపీ బరువు తగ్గిపోవడం దగ్గినప్పుడు ఉమ్మిలో రక్తం చారలు లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి జాగ్రత్త చర్చలను తీసుకొని క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించాలని కోరారు. అనంతరం వాహనదారులకు , పాదచారులకు కర్ర పత్రాలు పంపిణీ చేసి లక్షకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, తరులు పాల్గొన్నారు.