నారా లోకేష్ యువగళం పాదయాత్ర 55వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం పెనుగొండలో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తూ కియా పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిశ్రమను పరిశీలించారు. ఈ సందర్భంగా కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ తీసుకుంటూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా పరిశ్రమలు వచ్చాయని అన్నారు. ఈ పరిశ్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీరూపంలో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందే తప్ప.. చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామని.. అందుకే ప్రజలు అలాంటి ఫలితాలు ఇచ్చారన్నారు.