ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఎస్ ఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం, అదనపులోడ్ క్రమబద్ధీకరణ కింద 600 కేసులు నమోదు చేశామన్నారు. ఈ మేరకు రూ. 13. 73 లక్షల జరిమానా విధిస్తూ సంబంధిత వినియోగదారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa