భారత సంతతికి చెందిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో అజయ్ బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో ఆయన నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.