గుజరాత్ అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. బాపునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్యను వేధిస్తున్నాడని మీరజ్ అనే స్నేహితుడుని కత్తితో పొడిచి చంపేశాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది. సర్ ప్రైజ్ అంటూ ఇంటికి పిలిచి కళ్లకు గంతలు కట్టి కత్తితో పొడిచి సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా నరికారు. పోలీసు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు.