ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 30, 2023, 01:00 PM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం పరిధిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే....  చిట్యాల గ్రామానికి చెందిన జుట్టా నాగేశ్వరరావుతో జుట్టా బేబికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. గత కొంత కాలంగా నాగేశ్వరరావు మద్యానికి బానిస కావడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా కొంత కాలం కిందట భార్య బేబి భర్త నాగేశ్వరరావును విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లి పోయింది. తన భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురైన నాగే శ్వరరావు ఈ నెల 26 నుంచి 28 తేదీల మధ్య తన ఇంటిలో ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి పరిసరాల్లో దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com