సామర్లకోట రైల్వే పోలీస్టేషన్ పరిధిలోని జి.మేడపాడు రైలు పట్టాలపై సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడి మృతదేహాన్ని సామర్లకోట రైల్వే పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కీమెన్ ఇచ్చిన సమాచారంతో జి.మేడపాడు ఎస్ఎస్ ఉప్పులూరి శేష కృష్ణకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్ఐ బి.లోవరాజు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడ్డాడా, రైలు ఢీకొని మృతి చెందాడా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.