గిరిజన సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సీదరపు అప్పారావు, బోయ,వాల్మీకిలను ఎస్టీల్లో కలపాలనే తీర్మానం రద్దు చేయకపోతే రానున్న ఎన్నికల్లో గిరిజనులు వైసీపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మామిడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బోయ,వాల్మీకులు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అభివృ ద్ధి చెందడంతో వారిని ఎస్టీల్లోకలపాలని అసెంబ్లీలో తీర్మానించడం దారుణమన్నారు. తీర్మానంఆమోదానికి గిరిజన ఎమ్మెల్యేలు అంగీకరించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా ఈనెల 31న రాష్ట్ర మన్యం బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆయనవెంట గిరిజననేతలు గెమ్మెల జానకీరావు,వంతల సుందరరావు ఉన్నారు.