ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. నేటి ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ 40 నిమిషాల పాటు సాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా సమావేశంలో చర్చించినట్టు సమాచారం.