ప్రస్తుతం దేశంలో మాదకద్రవ్యాల వినియోగం అతి పెద్ద సమస్యగా మారిందని, ప్రతి రాష్ట్రంలో కౌన్సె లింగ్ కేంద్రాలను పెంచి ఈ సమస్యలను నిర్మూలించాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మాదకద్రవ్యాల సమస్య రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వ్యాపించిందని, ఇది ఆరోగ్యం మీదే కాకుండా దేశ సంపదపైనా ప్రభావం చూపుతుందన్నారు. విదేశాల నుంచి వస్తున్న మాదక ద్రవ్యా లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థి దశ నుంచే పిల్లలకు సేవా కార్యక్రమాలపై మక్కువ కల్పించేవిధంగా చూడాలన్నారు.