ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్ళితే.... చేబ్రోలు మండలం శలపాడు గ్రామానికి చెందిన పి.త్రివేణి(19) తెనాలి కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) కూలి పనులకు వెళ్లి వస్తుంటాడు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారన్న సమాచారం తెలుసుకున్న త్రివేణి తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. అనంతరం రెండు రోజుల కళాశాలకు వెళ్లిన త్రివేణి ఇంటికి తిరిగిరాలేదు. ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులు చేబ్రోలు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. త్రివేణి శీకాంత్తో కలిసి వెళ్తుండగా చూసిన త్రివేణి స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తివ్రేణి కోసం గాలించిన అనంతరం ఆమె తల్లిద్రండులు చేబ్రోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం ఉదయం సుద్దపల్లి రైల్వే గేటు వద్ద పట్టాలపై రెండు మృతదేహాలను రైల్వే కీమ్యాన్ గుర్తించి స్టేషన్మాష్టరుకు సమాచారం అందించారు. ఆ మృత దేహాలు త్రివేణి, శ్రీకాంత్లవిగా గుర్తించారు. గుంటూరు రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు.