పురుషోత్తముడు, జానకీవల్లభుడు, త్రివిక్రముడు పేర్లతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రాముని ఆలయాలు అనేకం ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లోని రఘునాథ ఆలయం ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందింది, తమిళనాడు రామస్వామి ఆలయంలో రామలక్ష్మణ, భరత, శతృఘ్నుడు కూడా పూజలందుకుంటున్నారు. అయోధ్య రామజన్మభూమి, అమృత్ సర్ రామతీర్థాలయం, ఎంపీలోని రామరాజ మందిరం ప్రసిద్ధి చెందాయి.