40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారని ధైర్యం ఉంటే ఆ పేర్లు బయట పెట్టాలని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డి తెలిపారు. పెనుబల్లి గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా రైతు భరోసా కేంద్రం, పెనుబల్లి-కాగులపాడు మధ్య తారు రోడ్డును ప్రారంభించారు. దళితవాడలో రూ.10 లక్షలతో డ్రైన్ల నిర్మాణం, పలువురికి ఆర్థిక సాయం, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.2లక్షల ఎంపీపీ నిధులను ఎమ్మెల్యే ప్రకటించారు.