వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సవాల్ విసిరారు. ‘‘ఆనం ఈమధ్య కొత్తగా ఓమాట చెబుతున్నారు. పార్టీ సిద్ధాంతాల గురుంచి, ఆత్మప్రభోదంసారం అంటున్నారు. నీకు ఏ పార్టీ సిద్ధాంతం నచ్చుతుందో ఆ పార్టీలో చేరి వెంకటగిరి నుండి పోటి చెయ్యి, నేను వైసీపీ నుంచి పోటీ చేస్తా. ఎవరి స్థాయి ఏమిటో తెలుస్తుంది.’’ అని ఆయన సవాల్ విసిరారు. ఆత్మప్రభోదంసారం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నీకు ఓటు వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఆనం చేసిన అన్యాయాలు, అక్రమాలకి ఎంత మంది బలయ్యారో అందరికీ తెలుసని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు.