శ్రీ రామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.