పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండల పరిధిలో గురువారం జానకిరామపురం గ్రామం వద్ద స్థానికి ఎస్ఐ పైడి బాబు ద్విచక్ర వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో పలు వాహనాలకు పరీక్షించి సరైన పత్రాలు లేని వాహనాలకు జరి మానాలు ఆన్లైన్లో విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పైడి బాబు మాట్లాడుతూ వాహనాలు నడిపే వ్యక్తి లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. ఈ తనిఖీలలో కానిస్టేబుల్స్ గణేష్, నాగమల్లేశ్వరరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.