శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలంలో గురువారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 55వ రోజు కు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 695. 1 కిలోమీటర్లు నడిచారు. పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. హరిపురంలో స్థానికులతో మాటామంతీ, మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాటామంతీ. అమ్మవారిపల్లిలో స్థానికులతో మాటామంతీ. యువగళం పాదయాత్ర 700 కి. మీ. లకు చేరుకుంటుంది. గుట్టూరులో 700 కి. మీ. లకు చేరిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ. గుట్టూరు హైవే పక్కన కుంచిటిగ వక్కలింగ సామాజికవర్గీయులతో ముఖాముఖి. మధ్యాహ్నం గుట్టూరు హైవే పక్కన భోజన విరామం. గుట్టూరు హైవే వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు. సాయంత్రం యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవరర్గంలోకి ప్రవేశం. సికెపల్లి శివార్లలో స్థానికులతో మాటామంతీ. కోన రోడ్డులో స్థానికులతో మాటామంతీ. సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.