ఇన్నర్ వీల్ క్లబ్ సేవలు ప్రశంసనీయ మని గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెడీమేడ్ దుస్తులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కావున విద్యార్థులు శ్రధ్ధగా క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్టు యార్డు చైర్మన్ ఎస్విఆర్ మోహన్, సర్పంచ్ నక్కా నీలమ్మ, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు త్రిష్లా బన్సాలి, దుస్తుల దాత దినేష్ బన్సాలి, క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.