పెడన నియోజకవర్గం పెడన పట్టణ కార్యలయంలో గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ మీడియా తో మాట్లాడారు. టిడిపి నెత నేత నారా లోకేశ్ పాదయాత్రను ఓ ఫన్నీ యాత్రగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేశ్ కు పాదయాత్ర చేసే అర్హత ఉందా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో టిడిపి కి అమ్ముడుపోయిన ఎమ్యేల్యే లు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వాళ్లకు సీట్లు కూడా రాకపోవచ్చు అని అన్నారు. ప్రజల మనసుల్లో సిఎం జగన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, ప్రజల మనసులను చంద్రబాబు కొనలేరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.