ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుతం రాష్ట్రంలో జగనన్న హయాంలో రామపాలన నడుస్తోందని చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చీరాల, పర్చూరు నియోజకవర్గాల ప్రజానీకానికి, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సద్గుణ సంపన్నుడు, నీతిమంతుడు అయిన శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని ఆమంచి తెలిపారు. ఈ పండగను అందరూ సంతోషంగా గడుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.