ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి రైల్వే పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారాలు చెత్తాచెదారాలను రైల్వే స్టేషన్ సమీపంలో వేయవద్దని విజ్ఞప్తి చేశారు. పిచ్చి మొక్కలను కూడా ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చూసుకోవాలని వారికి తెలిపారు. ఇటీవల రైల్వే స్టేషన్ సమీపంలో పిచ్చి మొక్కల లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు చిరు వ్యాపారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.