విపత్తుల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని జడ్పిటిసి రవికుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, తహసిల్దార్ చంద్రశేఖర్ లు తెలిపారు. బుధవారం వేంపల్లి పట్టణంలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విపత్తు నివారణపై అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పూర్తి నష్టాలను నివారించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బండి వీరారెడ్డి, హెచ్ఎం విజయ్ కుమారి , ఆర్ఐ లోకేష్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధు, ఎన్ డి ఆర్ ఎఫ్ బృంద సభ్యులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.