సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముని ఆశీస్సులుతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి లు ఆకాంక్షించారు. సొంతూరు రామాపురం మండలం, సుద్దమల్ల గ్రామం, ఎర్రంరెడ్డిగారి పల్లెలోని రామాలయంలో గురువారం జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిలు కుటుంభ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో , వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శ్రీరాముడి కరుణా కటాక్షాలుతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులుతో జీవించాలని శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి లు ఆకాంక్షించారు.