ఢిల్లీలో జరిగిన జాతీయ మైనారిటీ కమిషన్ వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ మైనారిటీ కమిషన్ సలహాదారుడు షేక్ షబ్బీర్ అహ్మద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. జాతీయ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు లోన్లు ఇప్పించడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బల్ సింగ్ లాల్పుర, వైస్ చైర్మన్ కెర్సీ కైకుస్రో దేవో, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, సభ్యులు కుమారి షహజది, అర్షద్ ఆయుబ్ ఖాన్, షఫీఉల్లా, మోహన్ రావు పాల్గొన్నారు.