చిట్వేలి మండలంలో ప్రభుత్వ భూములు, స్థలాలు యదేచ్చగా కబ్జాదారులు ఆక్రమిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం మండలంలో చర్చినియాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాలు, రోడ్డు పక్కన ఉన్న స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా ప్రతినిత్యం అదే దారిలో వెళ్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిట్వేలి లోని కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న భూమిలో వేసిన ప్లాట్ల లోనికి రహదారి కొరకు ఎల్లమరాజు చెరువు కాలువను ఆక్రమించి నూతనంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే రోడ్డు ప్రక్కన ఖాళీ స్థలంలో పక్కా భవనాలు నిర్మించినప్పటికీ పట్టించుకునే నాధుడే లేడు. రోడ్డు భవనాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాని అయోమయంలో ప్రజలు ఉన్నారు.