మధ్యప్రదేశ్‌లో జరిగిన శ్రీ రామనవమి వేడుకల్లో అపశ్రుతి జరిగి 35 మంది చనిపోయారు. ఇండోర్‌లోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలి దానిపై కూర్చున్న భక్తులు బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మంగి గాయపడ్డారు. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.