అన్అకాడమీ సంస్థ ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్యోగుల్లో మరో 12 శాతం మందిని తొలగించింది. దీంతో 380 మంది ఉద్యోగాలు కోల్పోయారు. కాగా, సంస్థలో ఏడాది వ్యవధిలో ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2021లో సంస్థకు భారీగా నిధులు రాగా, ప్రస్తుతం నిధుల రాక నెమ్మదించింది. దీంతో ఉద్యోగుల తొలగింపు తగ్గడం లేదని సంస్థ తెలిపింది.