ఒడిశాలో భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగుపాటు శబ్దాలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (IMD) అధికారి తెలిపారు.