ఫిలిప్పీన్స్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న లేడీ మేరీ జాయ్-3 నౌకలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 31 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సముద్రంలో సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు 10 మంది సముద్రంలో దూకి జలసమాధి అయ్యారు. మిగిలిన వారు మంటల్లో కాలిపోయారు.