ఉసిరి టీ తాగితే ఇటు టీ తాగాలన్న కోరిక తీరడంతో పాటు విటమిన్ సి, పీచుపదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి, అల్లం అందుబాటులో లేనప్పుడు కప్పు నీళ్లను వేడిచేసి దానిలో స్పూను ఉసిరిపొడి, స్పూను సొంఠి పొడి, అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. నీళ్లు బాగా మరిగాక దించేసి తాగే వేడికి వచ్చాక వడకట్టకుండా నేరుగా తాగాలి. దీనిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగో షుగర్ ఉన్నవాళ్లకు చాలామంచిదట.